Wednesday, March 9, 2016

వాక్యము వినుచున్నావా...ఫలిస్తున్నావా...ఓ విశ్వాసి???

వాక్యము వినుచున్నావా ఓ విశ్వాసి
నీ నేల (హృదయము) ఎలాగున్నదో చెప్పవా ఎగాదిగా చూసి
విత్తువాడు విత్తుచున్నాడు సమృద్దిగా విత్తనములు (వాక్యము) పోసి
ఫలిస్తున్నావా నీవు ఆకాశమునకేసి

నీ నేల త్రోవ ప్రక్కన ఉన్న నేల వలె ఉన్నదా?
పక్షులు వచ్చి నేలపై విత్తనములు తినకుండా ఉంటాయా?
వాక్యమును గ్రహించుకొనకపోతే దానిని దుష్టుడు ఎత్తుకొనిపోడా?
విత్తే లేకపోతే ఫలము వస్తుందా?

నీ నేల చాలా మన్ను లేని రాతి నేలవలె ఉన్నదా?
రాతిలోకి విత్తనము చొరబడుతుందా?
వాక్యము విని సంతోషముతో అంగీకరించి శ్రమలలో అభ్యంతరపడుచున్నావా?
వేరు లోతుగా లేకపోతే సూర్య ప్రతాపానికి ఫలము వస్తుందా?

నీ నేల ముండ్ల పొదవలె ఉన్నదా?
ముండ్ల పొదల మధ్య మొక్క ఎదుగుతుందా?
ఐహిక విచారము ధన మోసము వాక్యమును అణచివేయవా?
ఎదగని మొక్క ఫలాలను ఇస్తుందా?

నీ నేల మంచి నేలవలె ఉన్నదా?
మంచి నేల ఫలభరితమైన చెట్లకు అవసరమే కదా?
వాక్యము విని గ్రహించువాడు సఫలుడు కాకుండా ఎందుకుంటాడు?
ముప్పదంతలు అరువదంతలు నూరంతలు ఫలించకుండా ఎలాగుంటాడు?

కాబట్టి... వాక్యము వినుచున్నావా ఓ విశ్వాసి
ఫలిస్తున్నావా నీవు ఆకాశమునకేసి

No comments:

Post a Comment