Wednesday, February 24, 2016

అగాపే

సర్వసృష్టిలోని ప్రేమలలోని మేటియైనది అగాపే (యేసుని ప్రేమ)
లోక ప్రేమల మత్తులో నిద్దురపోవుచున్న మానవ హృదిని ఇది మేల్కొలిపే
మానవ ఆత్మకు పరలోకమునకు చేరు మార్గమును ఇది చూపే
ఇది అర్థం కావలెనంటే మానవుడు చూడవలెను యేసు సిలువ వైపే

అగాపే దీర్ఘకాలము సహించును- లోక ప్రేమలు ఎంతకాలము సహించగలవు?
అగాపే దయ చూపించును- లోక ప్రేమలు నిర్దయగా వ్యవహరించట్లేదా?
అగాపే మత్సరపడదు- లోక ప్రేమలలో అసూయలు ఉండవంటారా?
అగాపే డంబముగా ప్రవర్తింపదు- లోక ప్రేమలు డంబముగా ప్రవర్తించట్లేదా?
అగాపే ఉప్పొంగదు- లోకప్రేమలు పాలపొంగులవంటివే కదా?
అగాపే అమర్యాదగా నడువదు- లోక ప్రేమలలో అమర్యాద లేదంటారా?
అగాపే స్వప్రయోజనమును విచారించుకొనదు- లోక ప్రేమలు స్వప్రయోజనములకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదా?
అగాపే త్వరగా కోపపడదు- లోక ప్రేమలలో అర్థవంతమైన కోపం కనబడుచున్నదా?
అగాపే అపకారమును మనస్సులో ఉంచుకొనదు- లోక ప్రేమలు అపకారము జరిగితే ఆరిపోవుటలేదా?
అగాపే దుర్నీతి యందు సంతోషించక సత్యమునందు సంతోషించును- లోక ప్రేమలలో అబద్దాలు రాజ్యమేలుట లేదా?
అగాపే అన్నిటికి తాళును- లోక ప్రేమలు ఎన్నిటిని కప్పుచున్నవో చెప్పగలవా?
అగాపే అన్నిటిని నమ్మును- లోక ప్రేమలలో నమ్మకత్వం కొరవడుట లేదా?
అగాపే అన్నిటిని నిరీక్షించును- లోక ప్రేమలు వేటికోసం నిరీక్షిస్తున్నవి?
అగాపే అన్నిటిని ఓర్చును- లోక ప్రేమలలో ఓర్పు త్వరగా అడుగంటిపోవట్లేదా?
అగాపే శాశ్వతకాలముండును- లోక ప్రేమలు నీటి బుడగల్లాంటివే కదా?

నేస్తమా!! కావాలి ప్రతి మానవునికి ఈ గొప్ప ప్రేమ
ఇది యేసే ఇస్తాడని తెలిసికొనుమా
యేసును నీ స్వంత రక్షకునిగా అంగీకరించుమా
విలువైన ఈ ప్రేమ కలిగి విలువైన నీ అత్మను అత్యున్నతమైన పరలోకమునకు చేర్చుమా

కావలెను...కావలెను...

కావలెను...కావలెను...
సమూయేలు వంటి దేవుని సన్నిధిలో గడిపే బాలుడు
యోసేపు వంటి తన పవిత్రతను కాపాడుకొనిన దేవుని భయము గలిగిన యోవ్వనుడు
దావీదు వంటి దేవునికి 7సార్లు ప్రార్ధించే మధ్య వయస్కుడు
అబ్రాహాము వంటి దేవునికి స్నేహితుడైన వృద్ధుడు
కావలెను...కావలెను... కాని ఎక్కడ దొరుకుతారు వీరు నేటి మన క్రైస్తవ సమాజములో

కావలెను...కావలెను...
యెహోషువ కుటుంబము వంటి దేవుని సేవించే కుటుంబము
యోబు వంటి తన పిల్లల పరిశుద్ధతను కాపాడే తండ్రి
హన్నా వంటి తన పిల్లల నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్ధించే తల్లి
ఇస్సాకు వంటి విధేయత కలిగిన కుమారుడు
యెఫ్తా కుమార్తె వంటి తన తండ్రి దేవునితో చేసిన ప్రమాణమును నెరవేర్చిన కుమార్తె
కావలెను...కావలెను... కాని ఎక్కడ దొరుకుతారు వీరు నేటి మన క్రైస్తవ సమాజములో
కావలెను...కావలెను...
బెరయ సంఘము వంటి ప్రకటించబడిన దేవుని వాక్యము పరిశీలించే సంఘము
ఏలియా వంటి విశ్వాసముతో ప్రార్థించే వీరుడు
యేసుక్రీస్తు వంటి మాదిరి కలిగిన సువార్తికుడు
దావీదు వంటి ఆత్మీయ కీర్తనాకారుడు
స్తెఫను వంటి క్రీస్తుకోసం మరణించే హతసాక్షి
కావలెను...కావలెను... కాని ఎక్కడ దొరుకుతారు వీరు నేటి మన క్రైస్తవ సమాజములో

ఎందుకు ఏడుస్తున్నాను నేను

ఎందుకు ఏడుస్తున్నాను నేను-అనవసరమైన కారణాల నిమిత్తం
ఎందుకు కన్నీరు వృధా చేస్తున్నాను-వాటి విలువ గ్రహించలేక
నేను నమ్మినవారు అందరు నన్ను మోసము చేశారని వృధాగా కన్నీరు కారుస్తున్నాను
కాని నేను నమ్మిన గొప్పవాడైన యేసయ్య నన్ను మోసం చేయలేదు కదా
మరి ఎందుకు ఏడుస్తున్నాను నేను
నాకన్న ఎవరైనా అశాశ్వతమైన గొప్ప స్థితిలో ఉంటే ఓర్చుకోలేక ఏడుస్తున్నాను
కాని నా యేసయ్య శాశ్వతమైన పరలోకములో నాకు స్థానము ఇచ్చాడు కదా
మరి ఎందుకు ఏడుస్తున్నాను నేను

నన్ను ఎవరైనా తక్కువగా చూస్తే తట్టుకోలేక బాధపడుచున్నాను
కాని నా యేసయ్య ఆయన చెంతకు వెళ్తే తన దూతలతో స్వాగతించి నాకు అతిధి మర్యాదలు చేస్తాడు కదా
మరి ఎందుకు ఏడుస్తున్నాను నేను
నన్ను ఎవరైనా దూషిస్తే తట్టుకోలేక విలవిల ఏడుస్తున్నాను
కాని అందరికంటే గొప్ప వాడైన యేసయ్య నన్ను ఏనాడు దూషించలేదు కదా
మరి ఎందుకు ఏడుస్తున్నాను నేను

ఛ! నేను ఎంత వెర్రివాడిని!! విలువలేని వాటి నిమిత్తం విలువైన కన్నీరు వృధా చేస్తున్నాను
కన్నీటి ప్రార్థన హన్నా కోరిక నెరవేర్చింది-హిజ్కియాకు ఆయుష్షు పెంచింది
కన్నీటి ప్రార్థన ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించింది-నీనెవె పట్టణాన్ని నాశనము కాకుండా కాపాడింది
విలువైన కన్నీటితో కూడిన ప్రార్థన ఎంతో విలువ గలది కదా
కాబట్టి కన్నీటితో విత్తుతాను...సంతోషముతో పంట కోస్తాను
పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు విత్తుతాను...సంతోషముతో పనలు కోస్తాను

Tuesday, February 16, 2016

ఎందుకు యేసయ్య అంటే నాకు ఇష్టం???

ఎందుకు యేసయ్య అంటే నాకు ఇష్టం
తీర్చాడనా నా కష్టం
నివారించాడనా నా నష్టం
నెరవేర్చాడనా నా ఇష్టం
కాదు... కాదు... కానే కాదు
నరకమునకు అర్హమైన పాపిని నేను
పరలోకమును చేరలేను నేనెన్నడును
చూపించాడు నాపై తన అమితమైన ప్రేమను
అర్పించాడు నాకోసం సిలువపై తన ప్రాణమును
నెరవేర్చాడు తాను తిరిగి లేస్తానన్న మాటను
ఆరోహణమైనాడు నాకోసం సిద్ధపరచుటకు పరలోకములో స్థలమును
చేశాడు తాను మరల నాకోసం వస్తాను అనే వాగ్దానమును
ఇవి చాలవా నాకు... ఇష్టపడుటకు నా ప్రియుడైన యేసును
కాబట్టి నేను...
వాక్యము వినుట ద్వారా పొందుతాను దేవుని యందలి విశ్వాసమును
ప్రార్థన చేయుట ద్వారా పొందుతాను దేవునితో సహవాసమును
బాప్తీస్మము ద్వారా పొందుతాను దేవుడిచ్చే ఉచిత రక్షణను
అంతము వరకు తొట్రిల్లకుండ పొందుతాను దేవుని నుండి జీవకిరీటమును