Tuesday, February 16, 2016

ఎందుకు యేసయ్య అంటే నాకు ఇష్టం???

ఎందుకు యేసయ్య అంటే నాకు ఇష్టం
తీర్చాడనా నా కష్టం
నివారించాడనా నా నష్టం
నెరవేర్చాడనా నా ఇష్టం
కాదు... కాదు... కానే కాదు
నరకమునకు అర్హమైన పాపిని నేను
పరలోకమును చేరలేను నేనెన్నడును
చూపించాడు నాపై తన అమితమైన ప్రేమను
అర్పించాడు నాకోసం సిలువపై తన ప్రాణమును
నెరవేర్చాడు తాను తిరిగి లేస్తానన్న మాటను
ఆరోహణమైనాడు నాకోసం సిద్ధపరచుటకు పరలోకములో స్థలమును
చేశాడు తాను మరల నాకోసం వస్తాను అనే వాగ్దానమును
ఇవి చాలవా నాకు... ఇష్టపడుటకు నా ప్రియుడైన యేసును
కాబట్టి నేను...
వాక్యము వినుట ద్వారా పొందుతాను దేవుని యందలి విశ్వాసమును
ప్రార్థన చేయుట ద్వారా పొందుతాను దేవునితో సహవాసమును
బాప్తీస్మము ద్వారా పొందుతాను దేవుడిచ్చే ఉచిత రక్షణను
అంతము వరకు తొట్రిల్లకుండ పొందుతాను దేవుని నుండి జీవకిరీటమును

No comments:

Post a Comment