Wednesday, February 24, 2016

ఎందుకు ఏడుస్తున్నాను నేను

ఎందుకు ఏడుస్తున్నాను నేను-అనవసరమైన కారణాల నిమిత్తం
ఎందుకు కన్నీరు వృధా చేస్తున్నాను-వాటి విలువ గ్రహించలేక
నేను నమ్మినవారు అందరు నన్ను మోసము చేశారని వృధాగా కన్నీరు కారుస్తున్నాను
కాని నేను నమ్మిన గొప్పవాడైన యేసయ్య నన్ను మోసం చేయలేదు కదా
మరి ఎందుకు ఏడుస్తున్నాను నేను
నాకన్న ఎవరైనా అశాశ్వతమైన గొప్ప స్థితిలో ఉంటే ఓర్చుకోలేక ఏడుస్తున్నాను
కాని నా యేసయ్య శాశ్వతమైన పరలోకములో నాకు స్థానము ఇచ్చాడు కదా
మరి ఎందుకు ఏడుస్తున్నాను నేను

నన్ను ఎవరైనా తక్కువగా చూస్తే తట్టుకోలేక బాధపడుచున్నాను
కాని నా యేసయ్య ఆయన చెంతకు వెళ్తే తన దూతలతో స్వాగతించి నాకు అతిధి మర్యాదలు చేస్తాడు కదా
మరి ఎందుకు ఏడుస్తున్నాను నేను
నన్ను ఎవరైనా దూషిస్తే తట్టుకోలేక విలవిల ఏడుస్తున్నాను
కాని అందరికంటే గొప్ప వాడైన యేసయ్య నన్ను ఏనాడు దూషించలేదు కదా
మరి ఎందుకు ఏడుస్తున్నాను నేను

ఛ! నేను ఎంత వెర్రివాడిని!! విలువలేని వాటి నిమిత్తం విలువైన కన్నీరు వృధా చేస్తున్నాను
కన్నీటి ప్రార్థన హన్నా కోరిక నెరవేర్చింది-హిజ్కియాకు ఆయుష్షు పెంచింది
కన్నీటి ప్రార్థన ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించింది-నీనెవె పట్టణాన్ని నాశనము కాకుండా కాపాడింది
విలువైన కన్నీటితో కూడిన ప్రార్థన ఎంతో విలువ గలది కదా
కాబట్టి కన్నీటితో విత్తుతాను...సంతోషముతో పంట కోస్తాను
పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు విత్తుతాను...సంతోషముతో పనలు కోస్తాను

No comments:

Post a Comment