Monday, March 16, 2015

నరకంలో ఒక ఆత్మ ఆవేదన



అయ్యో నరకం!! అయ్యయ్యో నరకం!!!
అగ్ని ఆరడం లేదు. బాధ ముగియడం లేదు.
ఏడ్పు ఆగడం లేదు. ఓదార్పు దొరకడం లేదు.
దాహం తీరడం లేదు. పండ్లు కొరుకుట మానడం లేదు.
ఎంతకాలం ఇలా...యుగయుగములు ఇలాగే ఉండాలేమో?
భూమి మీద విన్నదానికన్నా భయంకరం, ఎంతో భయంకరం.

క్రీస్తు యేసుకు కలిగిన తగ్గింపు మనస్సు కలిగియుండాలని చెప్పారు, నేను వినలేదు.
క్రీస్తు యేసు నా హృదయము దగ్గర నిలబడి తట్టుచున్నాడని తెలియజేశారు, నేను పట్టించుకొనలేదు.
క్రీస్తు యేసే పరలోకానికి మార్గము అని గట్టిగా నొక్కి చెప్పారు, నేను లక్ష్యపెట్టలేదు.
క్రీస్తు యేసుని నమ్మి బాప్తీస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని హెచ్చరించారు, నేను లోబడలేదు.

ఇప్పుడు గుర్తొస్తున్నాయి దైవజనుని హెచ్చరికలు. కాని ఏమి ఉపయోగం.
ఇప్పుడు స్మరణకు తెచ్చుకొంటున్నాను పాపక్షమాఫణ అవసరతను. కాని ఏమి ప్రయోజనం.
ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నది దేవునికి ఇస్టానుసారమైన జీవితం జీవించాలని.  కాని ఏమి లాభం.
ఇప్పుడు అనిపిస్తున్నది మనస్సు మారి నూతనమగుట తప్పనిసరి అని. కాని అవకాశమేది.

నా కోరిక నా పగవాడు కూడా దీనిలో పడకూడదని.
నా ఆశ నా కుటుంబము దీనిని తప్పించుకొనాలని.
నా ఆకాంక్ష నా పరిచయస్థులు దీనిని చేరకూడదని.
నా నిర్ణయం దీని గురించి నీకు తెలియజేయాలని.

నేస్తమా!!! తెలిసికో... సరిదిద్దుకో... నరకం తప్పించుకో....


No comments:

Post a Comment