Tuesday, March 3, 2015

నాకు సంపూర్ణ సంతోషం కావాలి

నాకు సంతోషం కావాలి. నాకు సంపూర్ణ సంతోషం కావాలి.
ఎవరినో బాధపెట్టి కాదు, ఎవరినో చులకన చేసి కాదు
ఏదో గెలిచానని కాదు, మరేదో సాధించానని కాదు
నాకు సంతోషం కావాలి. నాకు సంపూర్ణ సంతోషం కావాలి.

నోవహు దేవునికి లోబడ్డాడు. చితిసారకపు మ్రానుతో ఓడను కట్టాడు.
దేవుడు జలప్రళయం రప్పించాడు.సమస్తమును తుడిచి వేశాడు.
ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షింపబడ్డారు. నోవహు దేవునికి బలిపీఠము కట్టాడు.
ఇతనికి ఇది దేవుడు మాత్రమే ఇచ్చే సంపూర్ణ సంతోషము కాదా.

యోసేపు దేవునికి లోబడ్డాడు. పోతిఫరు భార్యతో పాపం చేయనన్నాడు.
అన్యాయంగా చెరసాలలో త్రోయబడ్డాడు.దేవుడు ఫరోకు కల రప్పించాడు.
యోసేపు చేత దాని భావము చెప్పించాడు. రాజు యోసేపును ప్రధానిగా నియమించాడు.
ఇతనికి ఇది దేవుడు మాత్రమే ఇచ్చే సంపూర్ణ సంతోషము కాదా.

యోబు దేవునికి లోబడ్డాడు. ఒక్కరోజులోనే అన్నిటిని కోల్పోయాడు.
ధూళిలో కూర్చున్నాడు. దేవుని దూషించమన్న భార్యను గద్దించాడు.
ఒక్క మాట కూడా నోరు జారకుండా మౌనముగా ఉన్నాడు. యోబు కోల్పోయినది దేవుడు మరల రెండంతలుగా ఇచ్చాడు.
ఇతనికి ఇది దేవుడు మాత్రమే ఇచ్చే సంపూర్ణ సంతోషము కాదా.

షద్రకు మేషాకు అబెద్నగోలు దేవునికి లోబడ్డారు. రాజాజ్ఞకు ఎదురొడ్డి నిలబడ్డారు.
భయంకరమైన అగ్నిగుండంలో త్రోయబడ్డారు. దేవుడు తన దూతనంపి అగ్నివాసన తగులకుండా కాపాడారు.
రాజ్యములో మిగతావారి కంటే వీరు హెచ్చింపబడ్డారు.
వీరికి ఇది దేవుడు మాత్రమే ఇచ్చే సంపూర్ణ సంతోషము కాదా.

నేస్తమా!! ప్రియనేస్తమా!!! సంపూర్ణ సంతోషము ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడే తెలుపుమా...

No comments:

Post a Comment